AP News: గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా భేటీ
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:27 PM
Andhrapradesh: గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్ కుమార్ చాహర్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కునైక్ స్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ పంటలు సాగు చేసే రైతులతో ముఖా ముఖీ నిర్వహించారు.
అమరావతి: గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్ కుమార్ చాహర్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కునైక్ స్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ పంటలు సాగు చేసే రైతులతో ముఖా ముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ... పాదయాత్రలో రైతు సంక్షేమంపై ఇచ్చిన హామీలను జగన్ మరిచారని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఏపీలోని రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్ మాట్లాడుతూ.. ఏపీలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని ఏపీలో సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తామని హామీ ఇచ్చి దగా చేసిందని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు పరిహరం చెల్లింపుల్లోనూ అలక్ష్యమ అని అన్నారు. రైతులకు కేంద్రం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయేలా చేస్తోందని విమర్శలు గుప్పించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Dec 30 , 2023 | 12:27 PM