ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vishnu Kumar Raju : రజత భార్గవ్ వంటి అధికారి ఏపీలో ఉండటం సిగ్గు చేటు

ABN, First Publish Date - 2023-08-29T12:21:45+05:30

టీటీడీ ట్రస్టు బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. హిందూ మతం మీద విశ్వాసం లేని వారికి చోటు కల్పించారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్రస్టు ఒకటి పెట్టుకొని...అందులో మీకు నచ్చిన వారిని నియమించు కోవాలన్నారు.

విశాఖ : టీటీడీ ట్రస్టు బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. హిందూ మతం మీద విశ్వాసం లేని వారికి చోటు కల్పించారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్రస్టు ఒకటి పెట్టుకొని...అందులో మీకు నచ్చిన వారిని నియమించు కోవాలన్నారు. వైసీపీ నేతలకు దోపిడీ జన్మ హక్కుగా మారిందన్నారు. బస్ బే నిర్మాణంలో వెల్డింగ్ బాగా లేదని జీవీఎంసీ కమినర్ అంటారా.. బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? అంటూ విష్ణు కుమార్ రాజు ఫైర్ అయ్యారు. బస్ బేకి టెండర్లు ఎప్పుడు పిలిచారో జీవీఎంసీ కమిషనర్ చెప్పాలన్నారు. కమిషన్లు కక్కుర్తి పడి ఇటువంటివి నిర్మించారన్నారు. జగన్ మెప్పు కోసం...త్వరగా కట్టాలనే ఉద్దేశ్యంతో నాణ్యత లేని బస్ బేలు కట్టారని విష్ణు కుమార్ రాజు విమర్శించారు.

ఇంకొక బస్ బే పడితే...మీ సంగతి చూస్తానంటూ విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. విశాఖలో వైసీపీ నేతలు భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో... విజయనగరం జిల్లా వారీగా ఓట్లు భారీగా నమోదు చేశారన్నారు. విశాఖ ఉత్తర నియోజక వర్గంలో272 పోలింగ్ బూత్ లో 66 పోలింగ్ బూత్ లో సర్వే చేశామన్నారు. 66 పోలింగ్ బూత్‌లలో 15 వేల 516 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నియోజక వర్గంలో 60 వేల నుంచి 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని విష్ణు కుమార్ రాజు విమర్శించారు. ఏపీలో విడతల వారీగా ఎన్నికలు వద్దని.. ఒకే విడత ఒకే రోజు ఎన్నికలు పెట్టాలన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి రజత భార్గవ్ అని వార్తలు వస్తున్నాయని.. ఇటువంటి అధికారి ఏపీలో పని చేయడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఆయన్ను ఇంటికి పంపించాలన్నారు. ఐఏఎస్ అధికారిపై జగన్ విచారణ జరిపించాలన్నారు. ఈ అధికారి వెనుక అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారు ఏమో అని ప్రజలు అనుకుంటున్నారని విష్ణు కుమార్ రాజు అన్నారు.

Updated Date - 2023-08-29T12:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising