ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: 23 నుంచి ఏపీలో పురందేశ్వరి పర్యటన.. ముగిసిన బీజేపీ పదాధికారుల సమావేశం

ABN, First Publish Date - 2023-07-16T18:46:15+05:30

బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన తొలి పదాధికారుల సమావేశం ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన తొలి పదాధికారుల సమావేశం ముగిసింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలపైనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు.


"2024 ఎన్నికలలో బీజేపీ ఎలా వెళ్లాలనే దానిపైనా చర్చ సాగింది. ప్రజా ఉద్యమాలతో పాటు, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలో చర్చించడం జరిగింది. మోడీ పాలనలో ఏపీకి చేసిన సాయం, అభివృద్ధి అంశాలను మరింత ముందుకు తీసుకెళ్తాం. వైసీపీ నేతలు తొంభై శాతం మ్యానిఫెస్టోను అమలు చేయకుండానే గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ ప్రజలను వంచించారు, మోసం చేశారు.. అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వీటన్నింటి పైనా ఆధారాలతో ప్రజలకు వివరించేలా కార్యాచరణ ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి ప్రాంతాలలో పర్యటిస్తారు. 23తేదీన రాయలసీమ జిల్లాలోని ప్రొద్దుటూరులో ఆ జిల్లా ముఖ్య నేతలతో సమావేశంలో పాల్గొంటారు. 25న కోస్తా నేతలతో గుంటూరులో పాల్గొంటారు. 26న గోదావరి జిల్లా నేతలతో రాజమండ్రిలో సమావేశం అవుతారు. 27వ తేదీన ఉత్తరాంధ్ర నేతలతో విశాఖలో భేటీ అవుతారు. ఏపీ ప్రభుత్వ తీరుపై అనేక కేంద్ర సంస్థలు తప్పు పడుతున్నాయి. ఇసుకను ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టి కొత్త తరహా దోపిడీ చేశారు. కేంద్రం పేదలకు ఇళ్లు ఇస్తే.. నిర్మాణం చేయకుండా మోసం చేశారు. ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భూములు అమ్మకానికి చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి. మూడు దశల్లో మద్యపాన నిషేధం పెడతామని జగన్ చెప్పలేదా. నేడు అదే మద్యం పేరుతో పేదలను ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. ప్రభుత్వమే మద్యం అమ్ముకుని కోట్ల రూపాయలు దోచుకుంటుంది. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తుంది. ధరల స్థిరీకరణ అన్న జగన్.. ఎక్కడైనా డబ్బులు డిపాజిట్ చేశారా చెప్పాలి. దేశంలోనే ఆత్మహత్యల జాబితాలో ఏపీ అగ్రభాగాన ఉందంటే జగన్ సిగ్గుపడాలి. వీటిని అంశాల వారీగా ప్రజలకు వివరించేలా అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేసేలా కార్యక్రమాలు చేపడతాం." అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-07-16T18:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising