Boragam Srinivasulu: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ గెలుపు ఖాయం
ABN, First Publish Date - 2023-05-18T19:41:42+05:30
బుట్టాయగూడెంలో టీడీపీ (TDP) చేపట్టిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నామని పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) తెలిపారు.
ఏలూరు జిల్లా: బుట్టాయగూడెంలో టీడీపీ (TDP) చేపట్టిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నామని పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) తెలిపారు. వాటిని ఫీడ్ బ్యాక్ ఫామ్లో నమోదు చేసుకోవడం జరిగిందని, సంక్షేమ పథకాల పేరుతో జగన్ రెడ్డి తన జేబులు నింపుకుంటున్నాడని ఆయన విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి పేదల అలవాటును ఆసరాగా తీసుకుని వారి కష్టాన్ని కల్తీ మందు రూపంలో దోచుకుంటున్న ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని బొరగం శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్ నవరత్నాలు అని మాయ మాటలు చెప్పి ఒక్క రత్నం కూడా మెరిసేలా చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగాని తనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా తయారు చేసిన జగన్కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇంటికి చెత్త పన్ను వేసిన ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదన్నారు.
పోలవరం నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యా సాగరిక, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ, చొడెం రామచంద్రరావు, మానెల్లి బాలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-18T19:43:50+05:30 IST