ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Satyanarayana : బొత్స సంచలన వ్యాఖ్యలు.. జగన్‌పై విమర్శలా.. లేదంటే చంద్రబాబుపైనా?

ABN, First Publish Date - 2023-04-21T14:28:23+05:30

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీఎం వైఎస్ జగన్ ఇటీవల ‘విశాఖలో సెప్టెంబర్ నుంచి సంసారం’ అని చేసిన కామెంట్స్‌పైనే చర్చ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీఎం వైఎస్ జగన్ ఇటీవల ‘విశాఖలో సెప్టెంబర్ నుంచి సంసారం’ అని చేసిన కామెంట్స్‌పైనే చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తుండగా.. వాటికి కౌంటర్ ఎటాక్ చేస్తూ వైసీపీ నేతలు, మంత్రులు కామెంట్స్ చేస్తున్నారు. అంతా ఓకే కానీ.. ఈ వ్యవహారంపై తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకే దారితీశాయి. అసలు బొత్స జగన్‌కు సపోర్టుగా మాట్లాడారా..? లేకుంటే జగన్‌ను బుక్ చేయడానికి మాట్లాడారా అనేది అర్థం కాని పరిస్థితి. ఇంతకీ బొత్స ఏం మాట్లాడారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇంతకీ బొత్స ఏమన్నారు..?

‘విశాఖ పట్నం పరిపాలన రాజధాని అనేదే మా పాలసీ. మాకు డైవెర్షన్ చేయ్యాల్సిన అవసరం లేదు’ అని కామెంట్స్ చేశారు మంత్రి. ఇక్కడితో ఆగితే బాగానే ఉండేది.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించబోయి బొత్స అడ్డంగా బుక్కయ్యారు. ‘చంద్రబాబు కాపురం కోసం అమరావతిలో రాజధానిని పెట్టారా? అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు? కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి?’ అని బొత్స ప్రశ్నించారు.

నిజానికి రాజధానికి, కాపురానికి బొత్స చెప్పినట్టు సంబంధం లేదు. తాజాగా ఏపీ సీఎం జగన్ (AP CM YS Jaganmohan Reddy) వ్యాఖ్యలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి విశాఖపట్నంలోనే కాపురం ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. మరి బొత్స ప్రకారం జగన్ కాపురం కోసం విశాఖను రాజధానిగా ప్రకటిస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే బొత్స మాటల ప్రకారం కాపురానికి, రాజధానికి ఏం సంబంధం ఉందని జగన్.. విశాఖను రాజధానిని చేసి అక్కడే కాపురం ఉంటానన్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇంకా డీఎస్సీ గురించి మాట్లాడుతూ..

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై సమీక్షించామని.. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. సీఎం జగన్ దీని పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. విద్యార్థులుకు రాగి జావా నిలిపివేశామంటూ వస్తున్న ప్రచారం తప్పు అని.. తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పుకొచ్చారు. పరీక్షలు, ఒంటి పూట బడుల వలన ప్రస్తుతానికి రాగిజావాకు బదులు చిక్కీలు ఇస్తున్నామని మంత్ర బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Updated Date - 2023-04-21T14:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising