IAS Srilaxmi: ఓబులాపురం మైనింగ్ కేసు... ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై సుప్రీంకు సీబీఐ
ABN, First Publish Date - 2023-08-24T15:17:42+05:30
ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎర్ర శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంను ఆశ్రయించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎర్ర శ్రీలక్ష్మిపై (IAS Srilaxmi) సుప్రీంకోర్టులో (Supreme Court) సీబీఐ (CBI) పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. గనుల కేటాయింపుల్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి (Obulapuram Mining Case) ఆయా చిత లబ్ధి కలిగించారని శ్రీ లక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి ఉన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అక్రమాస్తుల కేసుల్లోనూ శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. పెన్నా సిమెంట్స్‌కు అక్రమంగా లబ్ది చేకూర్చిన కేసులో జగన్‌తో పాటు ఐఏఎస్ అధికారిని నిందితురాలిగా ఉన్నారు. పెన్నా సిమెంట్స్ కేసులో జగన్, ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు శ్రీలక్ష్మి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అనంతపురంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి సుదీర్ఘ కాలం పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వర్తించి సమర్ధ అధికారిణిగా శ్రీలక్ష్మి పేరు తెచ్చుకున్నారు. తరువాత రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘ కాలం పాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ బాధ్యతలు నిర్వహించారు. అయితే కుట్రకు పాల్పడ్డారని, అక్రమంగా మైనింగ్ లైసెన్సులు మంజూరు చేశారని శ్రీ లక్ష్మిపై సీబీఐ అభియోగాలు మోపింది. గాలి జనార్దన్ రెడ్డికి (Gali Janardhanreddy) చెందిన ఓఎంసీ కంపెనీకి లైసెన్సుల మంజూరులో శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది. 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మిని అక్రమ మైనింగ్ కేసులో 2011లో సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Updated Date - 2023-08-24T15:27:20+05:30 IST