ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu Desam Party: పార్లమెంట్ ఆవరణలో చంద్రబాబు యోగక్షేమాలు అడిగిన కేంద్రమంత్రి

ABN, First Publish Date - 2023-09-21T16:18:39+05:30

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉండే ఎన్నారైలు ర్యాలీలు చేస్తూ చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. పార్టీలకు అతీతంగా కూడా పలువురు సీనియర్ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇండియా కూటమికి చెందిన మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కుమారస్వామి లాంటి నేతలు చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని అభిప్రాయపడ్డారు. అటు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు కూడా చంద్రబాబు అరెస్ట్ అంశంపై స్పందించారు. కోలీవుడ్‌లోనూ రజనీకాంత్, విశాల్ లాంటి హీరోలు టీడీపీ అధినేత అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేశారు. తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Payyavula: ఏడాది కాలంగా జగన్ ఆస్తుల కేసు ఎందుకు రావడం లేదు?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, టీడీపీ ఎంపీ కేశినేని నాని మధ్య చంద్రబాబు అరెస్ట్ అంశం చర్చకు వచ్చినట్లు తెలస్తోంది. ఈ రోజు పార్లమెంటు ఆవరణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎదురుపడ్డారని.. ఆయన చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని కేశినేని నాని చెప్పారు. చంద్రబాబు గొప్ప నాయకుడు అని.. ఆయన ఎటువంటి తప్పు చేసే వ్యక్తి కాదని మచ్చ లేని ప్రజా సేవకుడని.. భగవంతుని ఆశీస్సులతో అన్ని విజ్ఞాలు తొలిగించుకుని కడిగిన ముత్యంలాగ బయట పడతారని నితిన్ గడ్కరీ నమ్మకం వ్యక్తం చేశారని కేశినేని నాని వివరించారు. కాగా చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు విధించిన రిమాండ్ ఈనెల 21తో ముగియనుంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ.. ఆయనకు బెయిల్ ఇవ్వాలని టీడీపీ తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో వాదిస్తున్నారు.

Updated Date - 2023-09-21T16:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising