ACB court: చంద్రబాబును విచారణ చేసే సమయంలో ఇద్దరికి మాత్రమే అనుమతి
ABN, First Publish Date - 2023-09-22T19:48:58+05:30
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Chandrababu) విచారణ సమయంలో హాజరయ్యే ఇద్దరు న్యాయవాదుల వివరాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టు (ACB court) ఆదేశాలు ఇచ్చింది.
విజయవాడ: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును (Chandrababu) విచారణ సమయంలో హాజరయ్యే ఇద్దరు న్యాయవాదుల వివరాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టు (ACB court) ఆదేశాలు ఇచ్చింది.
విచారణ జరిపే అధికారుల పేర్లను కూడా ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. కొన్ని పేర్ల జాబితాను ఇచ్చిన న్యాయవాదులు.. వారిలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.
"చంద్రబాబుకు 17ఎ వర్తించదని మొదటి నుంచీ చెబుతున్నాం. స్కాంలో చంద్రబాబు పాత్రపై రెండు చోట్ల ఆధారాలు ఉన్నాయి. ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నాయనే చంద్రబాబును అరెస్టు చేశారు. కస్టడీ ఇస్తేనే.. మరింత లోతుగా ఆధారాల సేకరణ. అందుకోసం 5 రోజుల కస్డడీ అడిగాం. న్యాయమూర్తి 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు. న్యాయస్థానం చెప్పిన నిబంధనల ప్రకారం చంద్రబాబును విచారిస్తారు." ఏఏజీ పొన్నవోలు సుధాకరెడ్డి తెలిపారు.
Updated Date - 2023-09-22T19:48:58+05:30 IST