Chandrababu news: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత..
ABN, First Publish Date - 2023-10-09T10:53:32+05:30
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.
అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది. ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. మొత్తం 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ డిస్మిస్ చేసినట్టయ్యింది. నిజానికి కోర్టులో చంద్రబాబు పిటిషన్లకు సంబంధించి అంగళ్లు కేసులో బెయిల్ రావొచ్చని భావించారు. ఈ కేసులో నిందితులు అందరికీ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకు కూడా ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసులో కూడా ఊరట దక్కకపోవడం గమనార్హం.
మరోవైపు.. ఏసీబీ కోర్టులో రెగ్యులర్ వర్క్ మొదలైంది. లంచ్ తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. దీంతో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై మధ్యాహ్నం వరకు సస్పెన్స్ కొనసాగనుంది.
Updated Date - 2023-10-09T11:11:56+05:30 IST