ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం పోతుందంటూ జగన్‌పై చంద్రబాబు ఫైర్..

ABN, First Publish Date - 2023-08-16T17:48:39+05:30

మండపేట మండలం ఏడిద గ్రామంలో రైతులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా: మండపేట మండలం ఏడిద గ్రామంలో రైతులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన తీరుపై మండిపడ్డారు.


"6 నెలల్లో జగన్ ప్రభుత్వం పోతుంది. నేను ఏడిద గ్రామం వచ్చిన వెంటనే వర్షం రావటం శుభసూచికం. కరోనా సమయంలో వ్యవస్థలన్ని మూలనపడ్డాయి. రైతులు మాత్రం వ్యవసాయం ఆపలేదు. కాటన్ మహానీయుడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్మించారు. పోలవరం పూర్తయ్యి ఉంటే సాగునీరు, తాగునీరు పూర్తిస్థాయిలో అందేవి. జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారు. చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయా. టీడీపీ పాలనలో రైతులకే అధికారం ఇచ్చాను. జగన్ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. జగన్ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనిచేయకుండా చేశారు. చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మార్చేశారు. మళ్లీ మీరు ఓటు వేస్తే మేము అధికారంలోకి వస్తాం. దేశంలో రైతులపై సరాసరి అప్పు 75 వేలు అయితే.. ఏపీలో మాత్రం 2.40 లక్షల అప్పు ఉంది. రైతు భరోసా కేంద్రాలు రైతులపాలిట శాపంగా మారాయి. వైసీపీ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు." అని చంద్రబాబు అన్నారు.


"జగన్ పిచ్చి నిర్ణయాలు అభివృద్ధికి ఆటంకం. ధాన్యం కొనుగోలు చేయలేని జగన్ మూడు రాజధానులు కడతాడంట. కోనసీమ అందాల సీమ అంటూ ఎన్నో సినిమాలు తీశారు. కోనసీమలో కొబ్బరికి జగన్ మద్దతు ధర ఇవ్వటం లేదు. జగన్ ఆక్వాసాగును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆక్వా సాగు, రైతులు వెంటిలేషన్‌పై ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు పూర్వ వైభవం తీసుకువస్తా. ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి పంట. జగన్ తిక్క శంకరయ్య పంటల భీమా కావాలని రైతులు అడుగుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి మోగించాను. టీడీపీ అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచను. సోలార్ వ్యవస్థను ప్రోత్సాహిస్తాం. మందుబాబులను జగన్ మోసం చేశారు." అని చంద్రబాబు మండిపడ్డారు.

Updated Date - 2023-08-16T17:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising