TarakaRatna : తారకరత్న, టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యంపై చంద్రబాబు కీలక అప్డేట్.. ఏం చెప్పారంటే..
ABN, First Publish Date - 2023-01-31T22:51:48+05:30
బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న..
విజయవాడ/అమరావతి : బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న (Nandamuri Tarakartna), విజయవాడ రమేష్ ఆస్పత్రిలో (Ramesh Hospital) చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (tdp mlc bachula arjunudu) ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) కీలక అప్డేట్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రమేష్ ఆస్పత్రికి వెళ్లినబాబు.. గుండెపోటుతో చికిత్స పొందుతున్న బచ్చులను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బచ్చుల పూర్తిగా కోలుకుంటారని.. భయపడొద్దని కుటుంబ సభ్యులకు బాబు ధైర్యం చెప్పారు.
ఒకరోజు ముందే ఫోన్..!
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. బచ్చులను ఈ పరిస్దితిల్లో చూస్తానుకోలేదని భావోద్వేగానికి లోనయ్యారు. ‘ హార్ట్ ఎటాక్‌కు (Heart Attack) ఒకరోజు ముందు నాతో ఫోన్లో (Phone Call) మాట్లాడారు. మనసు విప్పి చాలా విషయాలు మాట్లాడారు. చాలా బాగా పనిచేస్తున్నావని బచ్చులకు చెప్పాను. ఎప్పుడు గన్నవరం (Gannavaram) ఎయిర్ పోర్టుకు వచ్చినా రిసీవ్ చేసుకునేవారు. వైద్యులు చాలా బాగా ట్రీట్మెంట్ (Treatment) చేస్తున్నారు. బచ్చుల ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్స్ (Doctors) స్పందించి సకాలంలో వైద్యం అందించారు. ఆయన.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. రెండు రోజుల తరువాత బచ్చుల ఆరోగ్యంపై డాక్టర్స్ అప్డేట్ చెప్పలేమన్నారు’ అని చంద్రబాబు మీడియాకు తెలిపారు. చంద్రబాబు విజయవాడ రాకతో రమేష్ ఆస్పత్రికి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ అక్కడ్నుంచి బాబు ఇంటికి వెళ్లారు.
నిలకడగానే..!
మరోవైపు తారకరత్న ఆరోగ్యంపై కూడా చంద్రబాబు స్పందించారు. ‘తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్లు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తారకరత్న త్వరగా కోలుకుని మామూలు మనిషిగా తిరిగిరావాలని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.
Updated Date - 2023-01-31T22:56:11+05:30 IST