ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు ఎదురుచూపులు.. ఆరు నెలలుగా పట్టించుకోని అధికారులు!

ABN, First Publish Date - 2023-06-10T18:03:10+05:30

కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటి నిర్మించుకోవాలని అనుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటి నిర్మించుకోవాలని యోచిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం ఆయనకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఆరు నెలల క్రితం అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. అయినప్పటికీ అధికారుల నుంచి చంద్రబాబుకు ఎలాంటి సమాచారం రాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన చంద్రబాబు.. న్యాయవాదుల ద్వారా అధికారులకు నోటీసులు పంపినట్లు సమాచారం.

చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఓ ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 99.77 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఆయనకంటూ కుప్పం నియోజకవర్గంలో సొంత ఇల్లు లేకపోవడం విపక్షాల విమర్శలకు తావిస్తోంది. దీంతో చంద్రబాబు సొంత ఇల్లు కట్టుకోవాలన్న నిశ్చయానికి వచ్చారు. ఇందుకోసం కడపల్లె వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇంటి నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఎన్నికల లోపు ఇంటిని నిర్మించుకోవాలని భావించినప్పటికీ అధికారులు సహకరించడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2023-06-10T18:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising