ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2023-02-22T16:52:11+05:30

గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల దుర్వినియోగంపై ఆయన లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల దుర్వినియోగంపై ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదనే హింస, దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గన్నవరం ఘటనలో బాధితులనే నిందితులుగా చేయడం దారుణమన్నారు. జగన్ రాజకీయ కక్షసాధింపునకు పోలీసులు పావుల్లా మారుతున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు, పోలీస్‌ టార్చర్ (Police Torture) అన్నట్లుగా సర్కార్‌ తీరు ఉందని తప్పుబట్టారు. గన్నవరం విధ్వంసం, పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. బాధితులైన టీడీపీ వారినే నిందితులుగా మార్చి.. జైలుకు పంపిన వైనంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని చంద్రబాబు కోరారు. జగ్గంపేట, పెద్దాపురం (Jaggampet Peddapuram)లో టీడీపీకి ప్రజాస్పందన చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. టీడీపీకి ప్రజాదరణ చూసి ప్రభుత్వానికి భయంపట్టుకుందని తెలిపారు. అనపర్తి సభతో ఉలిక్కిపడిన జగన్.. గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు.

కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. గన్నవరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డారు. పక్కా వ్యూహంతో టీడీపీ బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. నాయకుల కార్లను తగులబెట్టారు. ఈ మొత్తం అరాచకమంతా టీడీపీ టికెట్‌పై గెలిచి.. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలోనే సాగడం గమనార్హం. కళ్ల ఎదుటే వైసీపీ మూకలు ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు కళ్లప్పగించి చూశారు తప్ప అడ్డుకోలేదు.

పట్టాభి, మరో 16మందిపై హత్యాయత్నం కేసు

గన్నవరం టీడీపీ కార్యాలయం ఘటనలో బాధితులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికిపైగా టీడీపీ నేతలు, ఇతరుల పేరిట కేసులు నమోదు చేశారు. అలాగే గన్నవరం టీడీపీ నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికిపైగా టీడీపీ శ్రేణులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టాభి, మరో 16మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. బోడె ప్రసాద్‌తో పాటు మరో 11 మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-02-22T17:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising