ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : స్కిల్ కేసు విచారణ 15కి వాయిదా..

ABN, First Publish Date - 2023-11-10T11:19:12+05:30

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సీఐడీ విజ్ఞప్తి మేరకు కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే..

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత తీర్పు ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదావేసింది. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు కోర్టుకు దీపావళి సెలవులు. 19వ తేదీన ఆదివారం కూడా సెలవు. 20వ తేదీన కోర్టు పునఃప్రారంభమవుతుంది. ఆ వారంలో స్కిల్‌ కేసు తీర్పు వెలువడే అవకాశముందని న్యాయవాద వర్గాలు అంటున్నాయి.

ఫైబర్‌నెట్‌ కేసులో ఏసీబీ కోర్టు, హైకోర్టు తనకు ముందస్తు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ).. గురువారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబే వేసిన పిటిషన్‌పై తీర్పును తాము ఇదివరకే రిజర్వు చేశామని, దీపావళి సెలవుల తర్వాత దీనిని వెలువరించే అవకాశాలున్నాయని జస్టిస్‌ బోస్‌ తెలిపారు. ఫైబర్‌నెట్‌ కేసులో కూడా అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్‌కు సంబంధించిన సారూప్య అంశాలు ఉన్నందున.. స్కిల్‌ కేసులో తీర్పు ఇచ్చాకే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను చేపడతామని వెల్లడించారు.

Updated Date - 2023-11-10T11:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising