Chandrababu: మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్
ABN, First Publish Date - 2023-01-11T18:03:10+05:30
పుంగనూరు (Punganur)లో టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు.
చిత్తూరు: పుంగనూరు (Punganur)లో టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)వి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పుంగనూరులో పెద్దిరెడ్డి పని అయిపోయిందని జోస్యం చెప్పారు. దూసుకొస్తున్న పసుపు సైన్యాన్ని ఎదుర్కోలేక.. పోలీసుల సహకారంతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 10 రోజుల్లో 5 ఎఫ్ఐఆర్లు రాయించి 80 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని పెద్దిరెడ్డి తెలుసుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.
మంత్రి పెద్దిరెడ్డి నోటి నుంచి తరచూ వినిపిస్తున్న మాట ‘టార్గెట్ కుప్పం’. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలని ఎవరైనా లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అయితే వైసీపీ (YCP) సర్కారు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ (TDP) శ్రేణులను, మహిళా కార్యకర్తలను చితకబాదుతూ, ఎదురు కేసులు పెడుతున్నారు. ‘టార్గెట్ కుప్పం’ అంటే అరాచకం సృష్టించడమనే భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబు పర్యటనలో సభలు జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. జీవో1ను సాకుగా చూపారు. టీడీపీ కార్యకర్తలు ధిక్కరించడంతో గడ్డూరు, గొల్లపల్లెల్లో లాఠీలతో విరుచుకుపడ్డారు. మగ పోలీసులే మహిళలను చేతులతో చుట్టేసి అడ్డుకున్నారు. పైగా దెబ్బలు తిన్నవారి మీదే ఎదురు కేసులు పెట్టారు. టీడీపీ ప్రచార రథాన్ని అదుపులోకి తీసుకుని ఇంకో కేసు పెట్టారు.
Updated Date - 2023-01-11T18:03:12+05:30 IST