కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : వావ్.. చంద్రుడిపై బొజ్జ గణపయ్య..!

ABN, First Publish Date - 2023-09-18T22:24:09+05:30

వినాయకుడు.. మన నాయకుడేనని హిందువుల అందరి ప్రగాఢమైన భావన.. విశ్వాసం కూడా. ఎందుకంటే.. తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా.. దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని నిర్మల మనసుతో స్మరిస్తే చాలు.. పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు..

Chandrayaan-3 : వావ్.. చంద్రుడిపై బొజ్జ గణపయ్య..!

వినాయకుడు.. మన నాయకుడేనని హిందువుల అందరి ప్రగాఢమైన భావన.. అంతకుమించి విశ్వాసం కూడా. ఎందుకంటే.. తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా.. దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని నిర్మల మనసుతో స్మరిస్తే చాలు.. పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. ఇది ఆ గణనాయుకుడిని నమ్మి కొలిచే ప్రతి హిందువు నమ్మకం. మామూలు రోజుల్లో ఇలా ఉంటే.. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇక జనాల్లో ఎనలేని సంతోషం వచ్చేస్తుంది. ఇక రకరకాల రూపాల్లో.. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా విగ్రహాలను పలు గెటప్స్‌లో తెగ తయారుచేస్తుంటారు మేకర్స్. ఇక సైజులు అంటారా.. లెక్కే ఉండదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ గెటప్స్, సైజులు అయితే భారీగానే ఉంటాయి. ఇప్పుడంతా చంద్రయాన్-3 నడుస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సెట్స్‌తో కూడిన వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.


Jabilli.jpg

ఎక్కడీ వినాయక!

విజయవాడ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో ఉన్న వస్త్రలత కాంప్లెక్స్, పాత శివాలయం దగ్గర్లోని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చంద్రయాన్-3 విగ్రహాలు మండపంలో సృతజనాత్మకతతో ఏర్పాటు చేశారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన అనంతరం జాబిల్లిపై బొజ్జగణపయ్య దర్శనమిస్తారు. అనంతరం చంద్రుడిపై ఉన్న వినాయకుడి చుట్టూ విక్రమ్ ల్యాండర్ చక్కర్లు కొట్టేలా టెక్నాలజీని వినియోగించారు. ఈ విగ్రహాలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇతర ప్రాంతాల నుంచి.. జిల్లాల నుంచి ఈ ‘జాబిల్లిపై గణపయ్య’ విగ్రహాలను చూడటానికి జనాలు తరలివస్తున్నారు. ఒడిశా, కలకత్తాలోని పలు మండపాల్లో కూడా ఇలాంటి విగ్రహాలనే నిర్వహకులు ఏర్పాటు చేశారు. ఇలాంటి వీడియోలు, ఫొటోలు చూసిన నెటిజన్లు నిర్వాహకులకు హ్యాట్సాప్ చెబుతూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


ఇవి కూడా చదవండి


Lokesh : వై‘చీప్’ పాలిట్రిక్.. లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం.. ఇంత పైత్యం ఎందుకో..!?


Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!


TS Assembly Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. ఈ దెబ్బతో..!?


CBN Arrest : వినాయక చవితి రోజున టీడీపీ ఆసక్తికర ట్వీట్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ


Updated Date - 2023-09-18T22:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising