Tiger: ఆ తరువాతే చిరుతను వదిలిపెట్టడంపై నిర్ణయం..
ABN, First Publish Date - 2023-09-07T10:15:54+05:30
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. దీనిపై డీఎఫ్‌వో సతీష్ మాట్లాడుతూ.. ఈరోజు వేకువజామున చిరుత బందీ అయినట్లు తెలిపారు.
తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. దీనిపై డీఎఫ్‌వో సతీష్ మాట్లాడుతూ.. ఈరోజు వేకువజామున చిరుత బందీ అయినట్లు తెలిపారు. చిరుతని ఎస్వీ జూపార్క్‌కు తరలించి.. క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక మేరకు చిరుతని అడవిలో వదిలిపెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధునాతనమైన టెక్నాలజీని వినియోగించి జంతు కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా నడకమార్గాల్లో జంతు కదలికలపై నిరంతరాయంగా మానిటరింగ్ చేస్తామన్నారు. భక్త సంచారం లేనప్పుడు ఎలుగుబంటి సంచారం ఉందని తెలిపారు. కొద్దీ రోజులుగా నడకమార్గం సమీపంలో ఎలుగుబంటి సంచారం లేదన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో అర్ధరాత్రి మాత్రమే జంతు సంచారం ఉందన్నారు. శ్రీవారి మెట్టుని సాయంత్రం 6 గంటలకు మూసివేస్తాం కాబ్బటి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ప్రస్తుతానికి నడకమార్గం సమీపంలో జంతు సంచారం లేదని డీఎఫ్‌వో సతీష్ వెల్లడించారు.
Updated Date - 2023-09-07T10:15:54+05:30 IST