Tirupathi : గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం.. మహా రథానికి అంటుకున్న నిప్పు.. భవనంలో వర్కర్లు?
ABN, First Publish Date - 2023-06-16T12:25:43+05:30
తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌లో పెను అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మూడంతస్తుల భవనం తగలబడిపోతోంది. భవనంలో అనేకమంది వర్కర్లు ఉండే అవకాశం ఉంది. ఫోటో ఫ్రేములు, ఫోటో చిత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
తిరుపతి : తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మూడంతస్తుల భవనం తగలబడిపోతోంది. భవనంలో అనేకమంది వర్కర్లు ఉండే అవకాశం ఉంది. ఫోటో ఫ్రేములు, ఫోటో చిత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎగసిపడుతున్న మంటల నేపథ్యంలో గోవిందరాజు స్వామి ఆలయ మహా రథానికి అగ్ని సెగలు అంటుకున్నాయి.
మంటలు మరిన్ని షాపులకి, మహారథానికి అంటుకున్నాయి. మహారథం తగలబడటం ప్రారంభమైంది. ఇటీవలే ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పూర్తైంది. తిరుమల తిరుపతి దేవస్థానం కుంభాభిషేకం చేసింది. ఆలయంలో వందల ఏళ్ల నాటి పూర్వపు చెట్టు పడి ఒక భక్తుడు ఇటీవలే మృతి చెందాడు. ఇప్పుడు మహా రథానికి నిప్పు అంటుకుంది. దీంతో ఆలయంలోని భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనను తిరుపతి ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
Updated Date - 2023-06-16T12:45:55+05:30 IST