ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల ప్రొసీడింగ్స్‌పై జగన్ బొమ్మ.. వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:27 AM

Andhrapradesh: టీటీడీ ఉద్యోగుల ఇళ్ళ పట్టాల ప్రొసీడింగ్స్‌పై జగన్ బొమ్మను ప్రచురించడంతో టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పట్టాల పంపిణీని అడ్డుకోకుండా టీడీపీ తిరుపతి ఇన్‌చార్జీ సుగుణమ్మ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.

తిరుపతి: టీటీడీ ఉద్యోగుల ఇళ్ళ పట్టాల ప్రొసీడింగ్స్‌పై జగన్ బొమ్మను ప్రచురించడంతో టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పట్టాల పంపిణీని అడ్డుకోకుండా టీడీపీ తిరుపతి ఇన్‌చార్జీ సుగుణమ్మ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. నేడు తిరుపతి మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగులకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఇళ్లపట్టాల పంపిణీ చేయనున్నారు. పట్టాల పంపిణీని అడ్డుకుంటామని జనసేన, టీడీపీ ఇప్పటికే ప్రకటించాయి. గతంలో అనేక సార్లు ఉద్యోగులకు ఇంటి పట్టాలు ఇచ్చిన టీటీడీ, ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ నేతల ఫోటోలు పట్టాలపై ప్రచురించలేదు. ఇళ్ల స్థలాలను టీటీడీ ఉద్యోగులు డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డబ్బులు కట్టి తీసుకుంటున్న పట్టాలపై టీటీడీ లోగో మాత్రమే ఉండాలి తప్ప జగన్ ఫోటో ఎందుకు అని టీటీడీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పట్టాల పంపిణీ వాయిదా వేసి కొత్త పట్టాలు ప్రింట్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పట్టాల పంపిణీపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 28 , 2023 | 01:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising