ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Roja: పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా?... టీడీపీ అధ్యక్షురాలా?

ABN, First Publish Date - 2023-07-29T14:16:30+05:30

పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి: పురంధేశ్వరీ (AP BJP Chief Daggubati Purandeshwari) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందని మంత్రి రోజా (Minister Roja) వ్యాఖ్యలు చేశారు. శనివారం నగరంలో షెటిల్ పోటీలను మంత్రి ప్రారంభించి ఆపై షటిల్ ఆడారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లు ఏం మాట్లాడుతారో పురంధేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. పురందేశ్వరీ విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని హితవుపలికారు. ఇప్పుడు పడుతున్న కష్టం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని (TDP) తీసుకుని పడితే ఉపయోగం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitaraman) అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తక్కువ అని చెప్పారని గుర్తుచేశారు. నదుల అనుసంధానంపై ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నదులు అనుసంధానం కన్నా నిధులు అనుసంధానం చేయడంలో ఆసక్తి ఎక్కువ చూపారంటూ మంత్రి రోజా సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Updated Date - 2023-07-29T14:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising