ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhuvaneswari: 23న తిరుపతికి నారా భువనేశ్వరి

ABN, First Publish Date - 2023-10-22T08:11:06+05:30

తిరుపతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు.

తిరుపతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి, చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జురపు నాయుడు, అమ్మణ్ణమ్మల సమాదులకు నివాళిలర్పిస్తారు. 25న చంద్రగిరిలో జరిగే ‘నిజం గెలవాలి’ తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించడంతోపాటు, సీఎం జగన్‌ ప్రజావ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. అదేవిధంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై పార్టీ పోరు సాగించనుంది. ఇక, చంద్రబాబు అరెస్టుతో మానసికంగా కుంగిపోయి మృతి చెందిన కుటుంబాలకు పార్టీ అండగా నిలవనుంది. ఈ మేరకు మూడు కార్యక్రమాల ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయా కార్యక్రమాలను ఖరారు చేశారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వీటిని ప్రకటించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటించనున్నారు. ఈ పర్యటనను చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ప్రారంభించనున్నారు. భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లి బస చేస్తారు. మర్నాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ‘నిజం గెలవాలి’ పర్యటనను ప్రారంభిస్తారు. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చిన్న చిన్న సభలు, సమావేశాల్లో కూడా ఆమె పాల్గొంటారు. భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే ప్రథమం.

Updated Date - 2023-10-22T08:11:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising