ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌.. ఈ సోద‌రి జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌..

ABN, First Publish Date - 2023-02-12T11:19:35+05:30

చిత్తూరు: జ‌గ‌న్ (Jagan) అరాచ‌క‌పాల‌న‌లో అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జ‌గ‌న్ (Jagan) అరాచ‌క‌పాల‌న‌లో అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శించారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయ‌ని చెప్పేందుకు ఈ సోద‌రి మోహ‌న (Mohana) జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌ అన్నారు. పంట నష్టాలు విపరీతంగా రావడంతో చేసిన అప్పులు తీర్చ‌లేక‌ భర్త సోమేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కుటుంబ పోషణ కోసం మోహ‌న చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకుంది. కష్టపడి చ‌దువు పూర్తిచేసిన పిల్లల‌కు ఉద్యోగాలు రాక త‌ల్లికి చేదోడుగా ఉంటున్నారు. తన కష్టాలన్నీ సోదరి తనతో చెప్పుకుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బాగుప‌డ‌తాం అంటూ ఆమె ఆశాభావం వ్య‌క్తం చేసిందని లోకేష్ అన్నారు.

నేడు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారంనాటికి 17వ రోజుకు చేరింది. ఇవాళ కొత్తూరు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈరోజు పాదయాత్రలో లోకేష్‌ సతీమణి బ్రాహ్మణి కూడా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గీయులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. 2 గంటలకు కొత్తిరివేడు దగ్గర స్థానికులతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అలాగే 5:40 గంటలకు డీఎం పురం గ్రామస్తులతో మాటామంతి జరగనుంది. రాత్రి 07.50 గంటలకు ద్వారకానగర్‌కు పాదయాత్ర చేరుకోనుంది. రాత్రి 09.05 గంటలకు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురు విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

Updated Date - 2023-02-12T11:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising