Nara Lokesh: బీసీ మహిళా మేయర్ ఉండగా.. అభినయరెడ్డి సూపర్ మేయర్గా వ్యవహరిస్తున్నారు
ABN, First Publish Date - 2023-02-26T19:49:07+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan)పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan)పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. కుప్పంలో పాడిపరిశ్రమను అభివృద్ధి చేశామని, వైసీపీ ప్రభుత్వం పాడి రైతులకు ఇన్సూరెన్స్ వర్తింపచేయడంలేదని ఆరోపించారు. వివేకా హత్యకు సంబంధించి నాడు సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాశారని, ఇప్పుడు సీబీఐ ఎవరిని పిలుస్తుందో అందరూ చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఏపీ మద్యం తాగితే డయాలసిస్ రోగులు అయిపోవాల్సిందే అని లోకేష్ అన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ తీసేసి విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.10 వేలు ఇచ్చి.. రూ.32 వేలు ఎగ్గొట్టారని నారా లోకేష్ విమర్శించారు.
బీసీ సంఘాల నేతలతో నారా లోకేష్ ముఖాముఖిగా మాట్లాడారు. తిరుపతి బీసీ మహిళా మేయర్ను విధులు నిర్వహించనివ్వడం లేదని, డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి సూపర్ మేయర్గా, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని నారా లోకేష్ ఆరోపించారు. తన స్వార్థం కోసం 23 వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ ఆపేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశాడని లోకేష్ విమర్శించారు. మాట తప్పి.. మడమ తిప్పడం.. మేనిఫెస్టోతోనే ప్రారంభించారని లోకేష్ అన్నారు. మంగళగిరిలో శ్రీశక్తి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని, మార్కెటింగ్ ఉండేలా స్వయం ఉపాధిలో శిక్షణ ఉంటుందని నారా లోకేష్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్
Updated Date - 2023-02-26T19:53:54+05:30 IST