ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala : చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే నేడు చిక్కిన మరో చిరుత

ABN, First Publish Date - 2023-09-20T08:40:43+05:30

తిరుమల నడకదారిలో బోన్‌కు మరో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. లక్షితపై దాడి చేసిన ప్రాంతాంలోనే ఈ చిరుత సైతం చిక్కడం గమనార్హం. ఇప్పటికే ఆరు చిరుతలను బంధించడం జరిగింది. అయితే లక్షితపై దాడి చేసిన చిరుతని గుర్తించడంలో ఉత్కంఠ కొనసాగుతోంది.

తిరుమల : తిరుమల నడకదారిలో బోన్‌కు మరో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. లక్షితపై దాడి చేసిన ప్రాంతాంలోనే ఈ చిరుత సైతం చిక్కడం గమనార్హం. ఇప్పటికే ఆరు చిరుతలను బంధించడం జరిగింది. అయితే లక్షితపై దాడి చేసిన చిరుతని గుర్తించడంలో ఉత్కంఠ కొనసాగుతోంది. లక్షితపై దాడి చెయ్యలేదని నిర్ధారణ కావడంతో ఇప్పటికే రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలేయడం జరిగింది. మరో రెండు చిరుతల రిపోర్ట్‌లు రావాల్సి ఉండటంతో.. చిరుతల్ని ఎస్వీ జూలో క్వారంటైన్‌లో ఉంచారు. నేడు చిక్కిన చిరుత నమూనాని సైతం అధికారులు ల్యాబ్‌కి పంపనున్నారు.

కాగా.. అలిపిరి కాలిబాట మార్గంలో ఆపరేషన్ చిరుత ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు నెలల వ్యవధిలో అలిపిరి నడక మార్గంలో ఆరు చిరుతలను అటవీ అధికారులు బంధించారు. జూన్ 22వ తేదీన 7వ మైల్ వద్ద కౌశిక్‌పై దాడి తరువాత చిరుతలను అటవీ అధికారులు బంధిస్తూ వస్తున్నారు. జూన్ 23వ తేదీ రాత్రి 7వ మైల్‌కి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుతను అటవీ అధికారులు బంధించారు. ఆగస్ట్11వ తేదీన అలిపిరి కాలిబాట మార్గంలోని నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో అరేళ్ళ బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. బాలికపై దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఆగష్టు 14, 17వ తేదీల్లో బోనులో రెండు చిరుతలు చిక్కాయి.

ఆగస్ట్ 28వ తేదీ 7వ మైల్‌కి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. సెప్టెంబర్ 7వ తేదీన నరసింహస్వామి ఆలయం..7వ మైల్‌కి మధ్యలో ఏర్పాటు చేసిన బోన్‌లో ఇంకో చిరుత చిక్కడం గమనార్హం. ట్రాప్ కెమెరాల ద్వారా మరో 5 చిరుత సంచారాలను గుర్తించి 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం మధ్యలోని అటవీ ప్రాంతంలో 9 బోన్‌లను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. నేటి ఉదయం నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కడంతో ఇప్పటి వరకూ చిక్కిన చిరుత సంఖ్య 7కు చేరుకుంది. దాదాసే ఇప్పటి వరకూ చిక్కిన చిరుతలన్నీ 7వ మైల్ వద్దనే చిక్కడం గమనార్హం.

Updated Date - 2023-09-20T08:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising