కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chittoor Dist.: వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆరుగురు రైతులు

ABN, Publish Date - Dec 25 , 2023 | 12:39 PM

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో రైతులపై వైసీపీ నాయకుల దౌర్జన్యం, అరాచకం మితి మీరిపోతోంది. వైసీపీ శ్రేణుల దాడిలో ఆరుగురు రైతులు గాయపడ్డారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటన గుడుపల్లి మండలం. వెంకటాపురంలో జరిగింది.

Chittoor Dist.: వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆరుగురు రైతులు

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో రైతులపై వైసీపీ నాయకుల దౌర్జన్యం, అరాచకం మితి మీరిపోతోంది. వైసీపీ శ్రేణుల దాడిలో ఆరుగురు రైతులు గాయపడ్డారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటన గుడుపల్లి మండలం. వెంకటాపురంలో జరిగింది. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వైసీపీ నాయకుడు అనుచరుల దాడి చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ జెడ్పీటీసీ రైతుల మధ్య భూ తగాదాల నేపథ్యంలో ఈ దాడికి తెగబడ్డారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై గుడుపల్లి పోలీస్ స్టేషన్‌లో బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. రైతులు రామప్ప, పద్మమ్మ, బెట్టప్ప, కాంతమ్మ, బాలరాజు, సోమశేఖర్‌లు కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 25 , 2023 | 12:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising