ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Fire: చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ ఫైర్

ABN, First Publish Date - 2023-09-28T14:46:40+05:30

తిరుపతి: చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలుగుదేశం మండిపడుతోంది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసింది. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని గురువారం తిరుపతిలో టీడీపీ నేతలు ఆరోపించారు.

తిరుపతి: చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టు (Arrest)పై తెలుగుదేశం (Telugudesam) మండిపడుతోంది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసింది. సీఎం జగన్ (CM Jagan) నియంతలా వ్యవహరిస్తున్నారని గురువారం తిరుపతిలో టీడీపీ నేతలు (TDP Leaders) ఆరోపించారు. అభివృద్ధికి సంకెళ్లా అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిప్పులు చెరిగారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పనబాక లక్ష్మి (Ex Minister Panabaka Lakshmi) విమర్శించారు. జగన్ సర్కార్ టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జనం నమ్మరని అన్నారు. సర్కార్ తీనును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్‌ (Fundamental Rights)కు సంకెళ్లు వేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే తామంతా ఈరోజు సంకెళ్లు వేసుకుని నిరసన చేపట్టామన్నారు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రం లేదని, నిరసన తెలపడానికి కూడా తమకు హక్కులేదని.. తమ హక్కులను కాలరాస్తున్న జగన్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ది చెప్పే రోజు వస్తుందని అన్నారు. నిన్న నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి యూనివర్శిటీకి వెళ్లి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని (Skill Development Centre) సందర్శించామని, అనేకమంది అక్కడ శిక్షణ పొందుతున్నారని, వందలాదిమంది శిక్షణ పొందినవాళ్లు ఉద్యోగాల్లో ఉన్నామని చెప్పారని పనబాక లక్ష్మి అన్నారు.

Updated Date - 2023-09-28T14:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising