ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalamPadayatra: లోకేష్ ముందు బాధలు చెప్పుకున్న భవన నిర్మాణ కార్మికులు

ABN, First Publish Date - 2023-02-01T11:15:15+05:30

అపూర్వ ప్రజాదరణ నడుమ టీడీపీ నేత లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఆరవ రోజు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: అపూర్వ ప్రజాదరణ నడుమ టీడీపీ నేత లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (NaraLokesh YuvaGalam Padayatra) ఆరవ రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా బైరెడ్డి పల్లె మండలం బేలుపల్లెలో పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు వెళ్లి వారిని పలకరించారు. జగన్ (AP CM JaganMohan Reddy)పాలనలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని భవన నిర్మాణ కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ (TDP) హయాంలో వెయ్యి రూపాయిలకు దొరికిన ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నారని తెలిపారు. మొదటి మూడేళ్లు పనులు లేక ఇబ్బందులు పడ్డామని... ఇప్పుడు పని దొరికి కూలీ వస్తున్నా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వలన బ్రతకలేని పరిస్థితి ఉందని తమ గోడు వెల్లబోసుకున్నారు. నకిలీ ఇసుక అమ్ముతున్నారని... పైకి మాత్రమే ఇసుక కింద అంతా మట్టి పోస్తున్నారు అంటూ భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చెందారు.

దీనిపై లోకేష్ (Lokesh Padayatra) స్పందిస్తూ... ‘‘టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం. ఆఖరికి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధులు కూడా ప్రభుత్వం పక్క దారి పట్టించింది. వైసీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం’’ నారా లోకేష్ (YuvaGalam Padayatra) భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-02-01T11:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising