Tirumala : వీకెండ్ రానే వచ్చేసింది. కానీ తిరుమలలో సీన్ రివర్స్..
ABN, First Publish Date - 2023-10-07T08:10:34+05:30
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అసలు వీకెండ్‌లో భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుంది. కానీ నేడు తిరుమలలో సీన్ రివర్స్ అయ్యింది. ఈ శనివారం మాత్రం భక్తుల రద్దీ ఏమాత్రం లేదు.
Tirupati : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అసలు వీకెండ్‌లో భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుంది. కానీ నేడు తిరుమలలో సీన్ రివర్స్ అయ్యింది. ఈ శనివారం మాత్రం భక్తుల రద్దీ ఏమాత్రం లేదు. క్యూలో కూడా భక్తులు పెద్దగా లేకపోవడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల్ని నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి కేవలం మూడు గంటల సమయం మాత్రమే పడుతోంది.
ఇక శుక్రవారం శ్రీవారిని 72,104 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.8 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక నిన్న శ్రీవారికి 25,044 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. ఈ నెల 14 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 15 నుంచి 23 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 23 న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Updated Date - 2023-10-07T08:10:34+05:30 IST