Tirumala : పాక్షిక చంద్రగ్రహణం.. శ్రీవారి ఆలయం తలుపులు మూసివేత
ABN, First Publish Date - 2023-10-28T07:28:03+05:30
నేడు శ్రీవారి ఆలయం తలుపులను ఆలయ అధికారులు మూసివేశారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచనున్నారు. అర్థరాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులను తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేయనుంది
తిరుమల : నేడు శ్రీవారి ఆలయం తలుపులను ఆలయ అధికారులు మూసివేశారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచనున్నారు. అర్థరాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులను తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేయనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందే.. ఆలయం తలుపులు మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3:15కు తిరిగి శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 13 గంటలపాటు భక్తులకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే నేడు సహస్ర దీపాలంకారణ సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలను అధికారులు రద్దు చేయనున్నారు.
Updated Date - 2023-10-28T07:28:03+05:30 IST