Bhumana: యువతలో సంప్రదాయ స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తాం
ABN, First Publish Date - 2023-09-04T16:57:26+05:30
యువతలో సంప్రదాయ స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తామని తెలిపారు. మానవ నాగరిక జీవనంలో 30 వేల సంవత్సరాల క్రితం శిల్పకళ ప్రారంభమైందని చెప్పారు. చరిత్రకు ఆధారం శిల్పాలు అన్నారు. ప్రధానంగా శిల్ప కళాశాలలో యువతలో నైపుణ్యత పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.
తిరుపతి: అలిపిరిలో ఎస్వీ శిల్ప కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే వర్క్ షాప్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్‌తో పాటు స్టాల్స్‌ను ప్రారంభించి మాట్లాడారు. యువతలో సంప్రదాయ స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తామని తెలిపారు. మానవ నాగరిక జీవనంలో 30 వేల సంవత్సరాల క్రితం శిల్పకళ ప్రారంభమైందని చెప్పారు. చరిత్రకు ఆధారం శిల్పాలు అన్నారు. ప్రధానంగా శిల్ప కళాశాలలో యువతలో నైపుణ్యత పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. డెలిగేట్స్‌తో వర్క్ షాప్ ద్వారా మెలుకువలు నేర్చుకోగలుగుతున్నామని తెలిపారు. కలంకారీని రాష్ట్ర కళగా ప్రకటించేలా ముఖ్యమంత్రిని (CM Jagan) ఒప్పిస్తానని భూమన వెల్లడిచారు.
Updated Date - 2023-09-04T16:57:26+05:30 IST