ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TTD EO: 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం

ABN, Publish Date - Dec 18 , 2023 | 04:51 PM

Andhrapradesh: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో చర్చించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని తెలిపారు. జనవరి 1వ తేదీ అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు.

తిరుమల: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో చర్చించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని తెలిపారు. జనవరి 1వ తేదీ అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు. వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తామన్నారు. ఈ పది రోజుల పాటు సిఫారస్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని ప్రకటించారు. తిరుమల్లో వసతి సమస్య ఉందని.. వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలన్నారు.

ఈ నెల 22న ఉదయం నుంచి 4.25 లక్షల దర్శన టోకెన్లను భక్తులకు కేటాయిస్తామని తెలిపారు. 10 రోజుల టోకెన్ కోటా పూర్తయ్యే వరకు భక్తులకు టోకెన్లను జారీ చేస్తామన్నారు. టోకెన్లను పొందిన భక్తులు 24 గంటల సమయం ముందే తిరుమలకు రావాలన్నారు. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తామని చెప్పారు. టోకెన్స్ లేని భక్తులు తిరుమలకు రావొచ్చని.. కానీ ఆ భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు గదులను కేటాయించమని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 18 , 2023 | 04:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising