ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: టీటీడీ సులభ కార్మికుల మెరుపు సమ్మె

ABN, First Publish Date - 2023-04-24T11:15:07+05:30

తిరుమల: టీటీడీ సులభ కార్మికులు తమ డిమాండ్ల నెరవేర్చలాంటూ సోమవారం విధులు బహిష్కరించారు. నిన్న కూడా కార్మికులు తిరుపతిలో ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ సులభ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చలాంటూ సోమవారం విధులు బహిష్కరించారు. నిన్న కూడా కార్మికులు తిరుపతిలో ఆందోళనకు దిగారు. ఇవాళ తిరుమల కొండపై విధులకు గైర్హాజరయ్యారు. అయితే శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కాగా సులభ కార్మికులు సమ్మె కొనసాగిస్తే.. ఎస్మా చట్టాని ప్రయోగించే యోచనలో టీటీడీ అధికారులు ఉన్నట్లు సమాచారం.

నిన్న అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా శ్రీనివాస సేత ఫ్లై ఓవర్ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సులభ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. గత 20 ఏళ్లకుపైగా టీటీడీలో కాంట్రాక్టు పద్ధతిలో చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నామని టీటీడీ అధికారులు జీతాలు పెంచకపోగా ఉన్న జీతాలను తగ్గిస్తున్నారన్న సమాచారంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 వేల మంది కార్మికులు అధికారులకు నోటీసులు ఇవ్వకుండానే సమ్మెకు దిగారు. తమను కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా టీటీడీలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు.

Updated Date - 2023-04-24T11:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising