Jr NTR fans: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై వైసీపీ దాడి.. అసలేం జరిగిందంటే...
ABN, First Publish Date - 2023-06-18T01:26:28+05:30
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన శనివారం సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది.ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. సూళ్లూరుపేటలోని రాఘవయ్య పేటకు చెందిన అన్నదమ్ములు వెంకటేష్ యాదవ్, సునీల్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.తారక్ ఫౌండేషన్ పేరిట రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు.
తిరుపతి, జూన్ 16 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన శనివారం సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. సూళ్లూరుపేటలోని రాఘవయ్య పేటకు చెందిన అన్నదమ్ములు వెంకటేష్ యాదవ్, సునీల్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. తారక్ ఫౌండేషన్ పేరిట రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. వారి ఎదుగుదలను సహించలేక ఆరు నెలల క్రితం వెంకటేష్ బైక్‌పై వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. మరోసారి శనివారం సాయంత్రం స్థానిక రైల్వేగేటు సమీపంలోని ఫాస్ట్‌పుడ్ సెంటర్ వద్ద సునీల్‌తో అప్పట్లో దాడి చేసిన వర్గమే ఘర్షణకు దిగింది.
తోపులాటలో గాయపడ్డ సునీల్ ఇంటికెళ్లాడు. వైసీపీ కార్యకర్తలు మరో 10 మందిని కూడగట్టుకొని సునీల్ ఇంటి వద్దకు రాత్రి ఏడున్నర గంటలకు చేరుకొని మళ్లీ ఘర్షణకు దిగారు. ఆ సమయంలో ఇంట్లో నిదురపోతున్న వెంకటేష్ బయటకు రావడంతో కత్తులు, రాడ్లతో దాడిచేశారు. దీంతో వెంకటేష్ ఆపస్మారక స్థితికి చేరుకోగా వైసీపీ కార్యకర్తలు పరారయ్యారు. గాయపడ్డ అన్నదమ్ములిద్దరినీ ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన ఓ కార్యకర్తకు కూడా గాయలైనట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-06-18T11:04:01+05:30 IST