ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CID: నారా లోకేష్‌పై ఏసీబీ కోర్టు, హైకోర్టులో సీఐడీ 2 రకాల మెమోలు దాఖలు

ABN, Publish Date - Dec 22 , 2023 | 07:46 PM

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ 41ఏ నిబంధనలు ఉల్లంఘించారని విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టులో సీఐడీ రెండు రకాల మెమోలు దాఖలు చేసింది.

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ 41ఏ నిబంధనలు ఉల్లంఘించారని విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టులో సీఐడీ రెండు రకాల మెమోలు దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో నారా లోకేష్ 41ఏ నిబంధనలు ఉల్లంఘించారని, అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ మెమో పైల్ చేసింది. ఈ మెమోను ఉదయం పరిశీలించి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పక్కన పెట్టారు. సాయంత్రం ఈ మెమోను ఈనెల 28వ తేదీన బెంచ్ మీదకు విచారణకు ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

కాగా నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ (NBW) జారీచేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధనలను లోకేశ్‌ ఉల్లంఘించారని ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా .. పత్రికల క్లిప్పింగ్‌లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేశ్‌ బెదిరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. 41ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉండదని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌పై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేశ్‌కు ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 22 , 2023 | 07:47 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising