CBN ARREST: పీటీ వారెంట్‌పై సీఐడీ మెమో దాఖలు.. 3 కేసులను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
ABN, First Publish Date - 2023-10-18T16:43:48+05:30
పీటీ వారెంట్‌పై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఈ రోజు ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది.
విజయవాడ: ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్, చంద్రబాబు హెల్త్ రిపోర్ట్, సీఐడీ అధికారుల కాల్ లిస్ట్‌తోపాటు మూడు కేసులను ఈ నెల 20కి వాయిదా వేసినట్లు విజయవాడ ఏసీబీ కోర్టు తెలిపింది.
పీటీ వారెంట్‌పై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఈ రోజు ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో సీఐడీ మెమో దాఖలు చేసింది. సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు 20కి వాయిదా వేసింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాడివేడిగా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను నిశితంగా విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేయడంతో పాటు.. తీర్పును కూడా రిజర్వ్ చేసింది.
Updated Date - 2023-10-18T17:37:13+05:30 IST