ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPI Leader: పొత్తులపై సీపీఐ నేత రామకృష్ణ క్లారిటీ..

ABN, First Publish Date - 2023-05-18T11:48:20+05:30

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సీబీఐ నేత రామకృష్ణ పొత్తులపై స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలతో తాము కలిసి పనిచేస్తున్నామని అన్నారు. తామందరం కలిసి 2024లో పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. బీజేపీతో కలిసి పోటీ చేయద్దని పవన్ కళ్యాణ్‌కు చెపుతామన్నారు. పాచిపోయిన లడ్డులు, మంచి లడ్డులు ఎలా అయ్యాయో పవన్ కళ్యాణ్ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఆ జీవో ఇస్తామనడం పోలీస్ రాజ్యం నడపాలనా?...

రామకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా జీఓ 1 ఉందని మండిపడ్డారు. విజ్ఞత లేకుండా మరల జీఓ ఇస్తామనడం పోలీసు రాజ్యం నడపాలనా అంటూ ప్రశ్నించారు. పోలీసు రాజ్యం నడపడానికి సీఎం అవసరమా అని మండిపడ్డారు. పోలీసు రాజ్యం నడపాలంటే డీజీపీని సీఎం సీట్లో కూర్చెబెట్టాలన్నారు. కొత్త జీఓ తెస్తే తాము ప్రత్యక్ష ఆందోళనకు సమాయుత్తం అవుతామని హెచ్చరించారు. ఇళ్ళ స్థలాల అంశం కంటే ముందు అమరావతి రాజధాని ఉందా లేదా చెప్పాలన్నారు. రాజధాని విశాఖపట్నమా?.. అమరావతా?.. స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘సెంటు భూమి ఏం చేసుకోవాలి... నీ బాత్ రూం అంత కూడా పేదవాడికి ఇవ్వరా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని బిక్షగాళ్ళుగా మారుస్తున్నారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 5 సెంట్లు ఇచ్చారని... రెండు లేదా మూడు సెంట్లు ఇవ్వాలని.. పేదలకు ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇచ్చి.. ఒకొక్కరికి 5 లక్షలు ఇవ్వాలన్నారు. పోలవరంపై కేంద్రంతో సీఎం జగన్ మాట్లాడాలని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-18T11:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising