Michaung Cyclone: బాపట్ల వద్ద తీరాన్ని దాటుతున్న మిచౌంగ్ తుఫాన్.. మరో రెండు గంటల్లో...
ABN, First Publish Date - 2023-12-05T15:34:49+05:30
Andhrapradesh: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఈ మేరుకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు మరో గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని ఐఎండీ ప్రకటించింది.
అమరావతి: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల వద్ద తీరాన్ని దాటుతోంది. ఈ మేరుకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు మరో గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని ఐఎండీ (IMD) ప్రకటించింది. తీరాన్ని దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో వేగంగా గాలులు, ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఇదే వేగంతో గాలులు, వర్షాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వరి, వాణిజ్య, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి భారీ వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
తుఫాన్ తీరం దాటినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. ఈరోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
Updated Date - 2023-12-05T15:37:00+05:30 IST