Devineni: వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్‌కు నోటీసులు..? భయంతో తాడేపల్లి కొంప వణుకుతోంది?
ABN, First Publish Date - 2023-07-30T18:35:59+05:30
మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ సర్కారుపై (Jagan govt) విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ సర్కారుపై (Jagan govt) విమర్శలు గుప్పించారు.
"వివేకా కేసులో తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్‌కు నోటీసులు రాబోతున్నాయి. భయంతో తాడేపల్లి కొంప వణుకుతుంది. A9,A10 లకు సీబీఐ నోటీసులు రానున్నాయి. ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు వీడియో ప్రజంటేషన్‌తో ప్రజల్లో అవగాహన వచ్చింది. ఆగష్టు 1 నుంచి 10 వరకు ప్రాజెక్టుల వద్దకు చంద్రబాబు వెళ్తారు. కర్నూలు నుంచి కార్యక్రమం ప్రారంభించి ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యం. వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖను గాలికి వదిలేశారు. సంక్రాంతికి డాన్స్ వేయడానికి ఇరిగేషన్ మంత్రి నువ్వు ఉండవు, ప్రజలు మిమ్మల్ని బంగాళాఖతంలో కలుపుతారు. పోలవరంకు గత నాలుగు ఏళల్లో వచ్చిన వరద చూసి అయిన ప్రభుత్వంకు బుద్ధి రాలేదు. గోదావరి డెల్టా, మెట్ట ప్రాంతం రైతులు కన్నీరు పెడుతున్నారు. రహదారులు దెబ్బతిని రోడ్లు మీద ప్రజలు వరినాట్లు వేస్తున్నారు. బుడమేరుపై సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారు. బుడమేరు చఫ్టపై ఎవరు బాధ్యత తీసుకుంటారు?. మంత్రి, ఎమ్మెల్యే, జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి." అని దేవినేని డిమాండ్ చేశారు.
"రైతు సోదరులందరు వేలాదిగా తరలివచ్చి చింతలపూడి మొదటి దశ పనులు వద్దకు, పోలవరం వద్దకు వచ్చి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలి. ఆగస్టు మూడో వారంలో ఎన్టీఆర్ జిల్లాలో లోకేష్ పాదయాత్ర. లోకేష్ పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలి. ఇసుకలో నుంచి తైలం తీయడమంటే ఇదే, మార్గదర్శిపై విషం చీమ్ముతూ కూడా సాక్షికి ప్రకటనలు. అగ్రిగోల్డ్ సంస్థ డబ్బులు అధికారంలోకి రావడమే ఇస్తానన్నావు ఇచ్చావా?. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో నువ్వు లాలూచి పడ్డావు, బాధితులకు నువ్వు సమాధానం చెప్పు. బురద చల్లడం కడుక్కోమనడమే నీ ప్రభుత్వం లక్ష్యం. డబ్బులు కట్టలు ఎప్పుడు వచ్చేవి, పోయేవి బయటకు వస్తుందని, సజ్జల హైదరాబాద్ సెవెన్ స్టార్‌లో దుకాణం పెట్టాడు. విజయసాయి రెడ్డి, సజ్జల లేకుండా మేనిఫెస్టో రాస్తారా, ఉమ్మారెడ్డి తెల్లవారుజామున తయారు చేశాడంట?. పోలీసులు దగ్గరుండి మా నాయకుడి బొమ్మ తగులబెట్టించారు. మా నాయకులు నిరసనకు దిగితే వంద మంది పోలీసులు ఉండి యుద్ధ వాతావరణం తలపించే విధంగా పోలీసులు ప్రవర్తించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? వైసీపీ నాయకులు రెండు గంటలు గుండాయిజం చేశారు. వాళ్ళకో న్యాయం, మాకో న్యాయమా, ఇటువంటివి పునరావృతం అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం." అని దేవినేని ఉమ హెచ్చరించారు.
Updated Date - 2023-07-30T18:50:17+05:30 IST