ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sanskriti: ప్రభల తీర్థానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2023-01-16T21:07:07+05:30

కనుమ రోజు సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లోని 120గ్రామాల్లో ప్రభల తీర్థాలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబాజీపేట: కనుమ రోజు సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లోని 120గ్రామాల్లో ప్రభల తీర్థాలు ఘనంగా జరిగాయి. అంబాజీపేట మండలం మొసలపల్లిలో శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థం వైభవంగా జరిగింది. జగ్గన్నతోట ప్రభల శకటాన్ని నూఢిల్లీ (New Delhi)లో జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభల శకటాన్ని తయారు చేయడానికి చర్యలు తీసుకుంది. జగ్గన్నతోట ప్రభల తీర్థం చూసేందుకు వేలాది మంది భక్తులు (Devotees) తరలివచ్చారు. 11గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులు జగ్గన్నతోటలో కొలువుతీరాయి. ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, వీరేశ్వరస్వామి ప్రభలను పచ్చని చేలను తొక్కుకుంటూ, పంట కాలువలను దాటిస్తూ తీసుకువచ్చిన దృశ్యాలు గగుర్పాటుకు గురిచేసింది.

మిగిలిన ప్రభలను ఆయా గ్రామాల నుంచి ఊరేగింపు తీర్థానికి తీసుకువచ్చారు. గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వరస్వామి, గంగలకుర్రు నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి నుంచి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక నుంచి కాశీవిశ్వేరస్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల నుంచి రాఘేశ్వరస్వామి, మొసలపల్లి నుంచి మధుమానంద భోగేశ్వరస్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభలు తరలివచ్చాయి. అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం గ్రామాల నుంచి 52అడుగుల ప్రభలను కొబ్బరితోటలు, పంట కాలువను దాటుకుంటూ వాకలగరువులో జరిగే తీర్ధానికి తీసుకువచ్చారు. తీర్థానికి వచ్చే సమయంలో విద్యుత్‌ లైన్లను తొలగించారు.

Updated Date - 2023-01-16T21:07:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising