ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: శ్రీవారి భక్తులే టార్గెట్‌

ABN, First Publish Date - 2023-04-16T20:50:47+05:30

శ్రీవారి దర్శనానికి, తిరుమలకొండపై వసతికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు కేటుగాట్లు భక్తులను (Devotees) మోసగిస్తున్నారు. దర్శనం, గదుల కోసం ఇంటర్నెట్‌ (Internet)లో సెర్చ్‌ చేసే భక్తులను కొందరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి దర్శనానికి, తిరుమలకొండపై వసతికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు కేటుగాట్లు భక్తులను (Devotees) మోసగిస్తున్నారు. దర్శనం, గదుల కోసం ఇంటర్నెట్‌ (Internet)లో సెర్చ్‌ చేసే భక్తులను కొందరు సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌గా చేసుకుని దోచేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి (Srivenkateswara Swamy) క్షణకాల దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో టీటీడీ (TTD) వివిధ రకాల దర్శనాలను చేయిస్తుంటుంది. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న క్రమంలో భక్తులకు దర్శన నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ఆన్‌లైన్‌ ద్వారానే దర్శనాలు, ఆర్జితసేవలు, గదుల కోటాను అధికంగా విడుదల చేస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు-దివ్యాంగులు, శ్రీవాణిట్రస్టు, అంగప్రదక్షిణ, ఆలయంలో జరిగే వివిధ ఆర్జితసేవలు, లక్కీడిప్‌ ఇలా చాలా వరకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తోంది. ఈక్రమంలోనే కొందరు కేటుగాళ్లు టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి.. వాటిలో ఆర్జితసేవలు, దర్శనాలు, గదులు బుక్‌ చేసుకోవచ్చు అంటూ భక్తులను మోసగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి, గదులకు అధిక డిమాండ్‌ నేపథ్యంలో భక్తులు కూడా అక్రమార్కుల వలలో పడి నిలువుదోపిడీకి గురవుతున్నారు. అలా మోసపోయిన భక్తుల నుంచి టీటీడీ ఉన్నతాధికారులకు, విజిలెన్స్‌ విభాగానికి నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.

40 నకిలీ వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు

నకిలీ వెబ్‌సైట్లను నమ్మి భక్తులు మోసపోతున్న క్రమంలో టీటీడీ పేరుతో చలామణి అవుతున్న వెబ్‌సైట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగానే టీటీడీ ఐటీ విభాగం నకిలీ వెబ్‌సైట్లపై ప్రత్యేక దృష్టిసారించింది. దర్శనాలు, వసతి, ఆర్జితసేవలంటూ భక్తులను నిత్యం మోసగించే వెబ్‌సైట్లపై దాదాపు నెలరోజులుగా నిఘా ఉంచారు. తిరుపతి దర్శన్‌ బుకింగ్‌, తిరుపతి దర్శనం.ఇన్‌ వంటి పేర్లతో ఉన్న నకిలీ వెబ్‌సైట్ల నుంచి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత ఆయా వెబ్‌సైట్ల ఐపీ అడ్రస్‌లను, వారు వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ నెంబర్లు, మోసం చేసే తీరును ఓ నివేదికగా తయారు చేసి తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-04-16T20:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising