ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: దిశ చట్టం పెద్ద మోసం: నారా లోకేశ్‌

ABN, First Publish Date - 2023-05-04T20:03:27+05:30

దిశ చట్టం (Disha Act) ఓ పెద్ద మోసం.. అసలు చట్టమే లేకుండా పోలీస్‌ స్టేషన్లు ప్రారంభించారని సీఎం జగన్‌‌పై టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: దిశ చట్టం (Disha Act) ఓ పెద్ద మోసం.. అసలు చట్టమే లేకుండా పోలీస్‌ స్టేషన్లు ప్రారంభించారని సీఎం జగన్‌‌పై టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు. యువగళం (Yuvagalam Padayatra) పేరిట సాగిస్తున్న పాదయాత్ర 89వ రోజు గురువారం కర్నూలు జిల్లా (Kurnool District) పాణ్యం నియోజకవర్గంలో కొనసాగింది. కల్లూరు మండలం రేమడూరు, పసుపుల, బొల్లవరం, బస్తిపాడు, చిన్నకొట్టాల, పెద్దకొట్టాల వరకు 11.9 కిలోమీటర్ల మేర నారా లోకేశ్‌ పాదయాత్ర సాగింది. దీంతో ఇప్పటి వరకు 1,147.5 కిలోమీటర్లు పూర్తి చేశారు. పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరితారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) లోకేశ్‌తో కలసి నడిచారు. లోకేశ్‌ పాదయాత్ర సాగుతుండగా గ్రామాల్లో యువనేతకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ పనులు చేస్తున్న రైతులను నారా లోకేశ్‌ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

మహిళలతో ముఖాముఖి

పాదయాత్రలో భాగంగా బొల్లవరం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్‌ మాట్లాడారు. ‘వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అవమానాలు పెరిగాయి. గుంటూరులో రమ్య అనే మహిళను ఓ వ్యక్తి నడిరోడ్డుపై హత్య చేశారు. జగన్‌ సొంత పులివెందుల నియోజకవర్గంలో మేకలు మేపేందుకు వెళ్లిన దళిత మహిళ నాగమ్మను కిరాతకంగా హతమార్చారు. చివరకు అసెంబ్లీ సాక్షిగా మా అమ్మను కూడా అవమానించారు..’ అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలతో పాటు విద్యార్థి దశనుంచే మహిళలను గౌరవించేలా కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో జగన్‌ సంపూర్ణ మద్యపాన నిషేదం అని మోసం చేసి, మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చాడన్నారు. జేబ్రాండ్‌ లిక్కరు విషం కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. సీఎం జగన్‌ డబ్బు పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడన్నారని దుయ్యబట్టారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇస్తామన్న పింఛన్‌ ఏమైంది జగన్‌..? అంటూ నారా లోకేశ్‌ ప్రశ్నించాడు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికి అమ్మ ఒడి ఇస్తానంటివి.. ఎందుకు ఇవ్వడం లేదు..? ఇది మహిళలను మోసం చేయడం కాదా? అని నిలదీశారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రో, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-05-04T20:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising