ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: టీటీడీ ట్రస్టులకు రూ.5 కోట్ల విరాళం

ABN, First Publish Date - 2023-06-09T19:56:09+05:30

టీటీడీ (TTD)కి చెందిన వివిధ ట్రస్టులకు శుక్రవారం రూ.5 కోట్లు విరాళం (Donation)గా అందాయి. ఓ భక్తుడు శుక్రవారం విరాళాల చెక్‌లను అందజేసి టీటీడీ ట్రస్టులకు వినియోగించాలని టీటీడీ అధికారులను కోరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ (TTD)కి చెందిన వివిధ ట్రస్టులకు శుక్రవారం రూ.5 కోట్లు విరాళం (Donation)గా అందాయి. ఓ భక్తుడు శుక్రవారం విరాళాల చెక్‌లను అందజేసి టీటీడీ ట్రస్టులకు వినియోగించాలని టీటీడీ అధికారులను కోరాడు. తన వివరాలను తెలిపేందుకు దాత నిరాకరించాడు.

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం అభిషేకసేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు. అలాగే ఉదయం వీఐపీ బ్రేక్‌ (VIP Break)లోనూ మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు.జస్టిస్‌ రాజశేఖర్‌ను రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

లోకకల్యాణార్థం ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాం

దేశంలో ఓ పెద్ద సినీ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం ఓ సంచలనాత్మకమైన ప్రాజెక్ట్‌ చేయబోతున్నామని సినీ రచయిత చిన్నికృష్ణ తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్‌కు చెందిన స్ర్కిప్ట్‌ను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశామన్నారు. అది ఏ చిత్రం, హీరో ఎవరు, ఏ కోణంలో ఉంటుందనే వివరాలను నిర్మాతే వారంరోజుల్లో వెల్లడిస్తారని తెలిపారు.

Updated Date - 2023-06-09T19:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising