Nara Bhuvaneswari: చంద్రబాబు ప్రజల మనిషి.. ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు?
ABN, First Publish Date - 2023-09-25T14:07:48+05:30
మా పోరాటం ప్రజల కోసం. మా కుటుంబం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా వేలాది మందిని చదివిస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు.. ప్రజలు అని ఆలోచిస్తారు. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు.
కాకినాడ: చంద్రబాబు (Chandrababu) ప్రజల మనిషి అని నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పేర్కొన్నారు. జగ్గంపేట దీక్షా శిబిరంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు. మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. హెరిటేజ్‌లో 2 శాతం అమ్మినా రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకొద్దు. మానవుడే దేవుడు అని మా నాన్న నమ్మారు. ఆ నీడలో మేము పెరిగాం. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాం.’’ అని చెప్పుకొచ్చారు.
‘‘మా పోరాటం ప్రజల కోసం. మా కుటుంబం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా వేలాది మందిని చదివిస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు.. ప్రజలు అని ఆలోచిస్తారు. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు. ప్రజల మనిషిని జైల్లో పెట్టారు. ప్రజల కోసం ఆయన జైలుకు వెళ్ళారు. అయినా చంద్రబాబు చేసిన తప్పు ఏంటి?.’’ అని నిలదీశారు.
‘‘స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ది చెంది అనేక మంది సీఈవో స్థాయికి వెళ్ళారు. చంద్రబాబు చేసింది తప్పా? ఆలోచించాలి. ఐటీ, ఇతర రంగాలు హైదారాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని ఆపేశారు. ప్రజలు టెర్రరిస్టులా?, హైదరాబాద్ నుంచి రావడానికి పాస్ పోర్ట్‌లు కావాలా?, ఎందుకు భయపడుతున్నారు. ఎప్పుడూ రాని మహిళలు కూడా బయటకు వచ్చారు. నేను బీఏ చదువుకున్నాను. చంద్రబాబు మంత్రి అయ్యాక నన్ను హెరిటేజ్‌లో వదిలేశారు. మూడు నెలలు కష్టపడి నేర్చుకుని హెరిటేజ్ చూసుకున్నాను. స్త్రీల గొప్పదనం వెలకట్టలేనిది. మహిళలకు ఇచ్చిన శక్తి దేవుడు ఎవరికి ఇవ్వలేదు.’’ అని భువనేశ్వరి తెలిపారు.
Updated Date - 2023-09-25T14:07:48+05:30 IST