ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhuvaneshwari: చంద్రబాబుతో సతీమణి భువనేశ్వరి ములాఖత్..

ABN, First Publish Date - 2023-09-18T13:12:40+05:30

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరితో పాటు కోడలు నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. చంద్రబాబును కలిశారు.

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సీఐడీ అక్రమంగా విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌పై ఉన్న టీడీపీ అధినేతతో ఆయన సతీమణి భువనేశ్వరి సోమవారం ములాఖత్ అయ్యారు. ఆమెతో పాటు కోడలు నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు. అంతకుముందు రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.


కాగా.. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గతవారం రెండోసారి చంద్రబాబుతో భువనేశ్వరి ములాఖత్‌ను జైలు అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వారినికి మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్నా జైలు అధికారులు తిరస్కరించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-18T13:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising