Bopparaju: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..
ABN, First Publish Date - 2023-04-25T12:48:09+05:30
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణమని బొప్పరాజు అన్నారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) చెప్పడం దారుణమని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) విమర్శించారు. మంగళవారం ఆయన కాకినాడ (Kakinada)లో మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల జీతాలతో పాటు ఏపీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
ఇప్పటికైనా ఉద్యోగులందరూ నిర్లక్ష్యం వహించకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచు కోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపిచ్చారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే జీతాలు సరైన సమయానికి పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 28న రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నామని, అందరూ హాజరు కావాలని బొప్పరాజు పిలుపిచ్చారు.
Updated Date - 2023-04-25T12:48:09+05:30 IST