ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chinnarajappa: అందుకే చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారు

ABN, First Publish Date - 2023-10-12T17:05:31+05:30

సామర్లకోట: చంద్రబాబును జైల్లో పెట్టి సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆరోపించారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి సామర్లకోటలో ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చారని అన్నారు.

సామర్లకోట: చంద్రబాబు (Chandrababu)ను జైల్లో పెట్టి సీఎం జగన్ (CM Jagan) ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే చిన్నరాజప్ప (MLA Chinnarajappa) ఆరోపించారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి సామర్లకోటలో ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చారని అన్నారు. తన నియోజక వర్గంలో చేపడుతున్న ప్రారంభోత్సవాలకు.. తనకు ఆహ్వానం లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారన్నారు. సీఎం వస్తుంటే.. టీడీపీ నేతలను అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా గురువారం ఆయన సామర్లకోటంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ చూస్తున్నారని చిన్నరాజప్ప ఆరోపించారు. అందుకే చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికారులు కూడా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని అన్నారు. తన నియోజకవర్గానికి సీఎం వస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ కూడా ప్రొటోకాల్ పాటించలేదన్నారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో తమ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేడయం, పరదాలు కప్పడం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడం మామూలు అయిపోయిందని చిన్నరాజప్ప మండిపడ్డారు. ఏది ఏమైనా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సజ్జల సాక్షిలో ఓ గుమస్తా అని, అన్ని శాఖలకు ఆయనే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు అరెస్ట్ నుంచీ అన్ని తప్పుడు కథనాలు చెబుతున్నారని చిన్నరాజప్ప అన్నారు.

Updated Date - 2023-10-12T17:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising