ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu CID: రాజమండ్రి జైల్లో కొనసాగుతున్న సీఐడీ విచారణ

ABN, First Publish Date - 2023-09-23T15:42:40+05:30

సీఐడీ అధికారులు ఉదయం 9:30కి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోగానే చంద్రబాబును వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారు. సీఐడీ, జైలు అధికారుల సమక్షంలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) సీఐడీ అధికారుల (CID) విచారిస్తున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ప్రతీ గంట సమయానికి ఐదు నిమిషాల బ్రేక్ ఇస్తున్నారు. ఉదయం దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ లంచ్ బ్రేక్ ఇచ్చారు. భోజన విరామం తర్వాత మళ్లీ విచారణ కొనసాగుతోంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ నడుస్తోంది. ఇదిలా ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

సీఐడీ అధికారులు ఉదయం 9:30కి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోగానే చంద్రబాబును వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారు. సీఐడీ, జైలు అధికారుల సమక్షంలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11:30కి విచారణ ప్రారంభించారు. రేపు కూడా సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు.

మరోవైపు సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని హైకోర్టు పేర్కొంది. ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

Updated Date - 2023-09-23T15:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising