కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీపీఐ బస్సుయాత్ర

ABN, First Publish Date - 2023-08-20T08:05:25+05:30

అల్లూరి జిల్లా: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సుయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధిని రామకృష్ణ సందర్శించనున్నారు.

CPI: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీపీఐ బస్సుయాత్ర

అల్లూరి జిల్లా: సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (K.Ramakrishna) నేతృత్వంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District)లో బస్సుయాత్ర (Bus Yatra) జరగనుంది. ఈ సందర్భంగా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధిని రామకృష్ణ సందర్శించనున్నారు. అలాగే గిరిజన సమస్యలపై చింతపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మూతపడిన పాఠశాలను సందర్శిస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల నేతలు హాజరుకానున్నారు.

కాగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్‌ చేశారు. ‘రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర పోస్టర్లను జంగారెడ్డిగూడెం సీపీఐ మండల సమితి కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మతోన్మాదాన్ని జోడించి దుష్ట సంప్రదాయాలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, జీవిత బీమా, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఆయిల్‌, బొగ్గు, స్టీల్‌, విమానయాన సర్వీసులు, రైల్వేలు, రక్షణ ఉత్పత్తులు, అంతరిక్ష పరిశోధన వంటి వాటిని కార్పోరేట్‌ శక్తులకు కారు చౌకగా అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు. మహిళలు, దళితులు, మైనార్టీలపై దాడులు అత్యాచారాలు వేధింపులు నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

Updated Date - 2023-08-20T08:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising