AP Govt: సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కార్ ఉక్కుపాదం
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:52 PM
Andhrapradesh: సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన వాలంటీర్లను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో నిన్న (బుధవారం) సమ్మెకు దిగిన 18 మంది వాలంటీర్లలో ముగ్గురిని తప్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ అయ్యాయి.
కోనసీమ జిల్లా, డిసెంబర్ 28: సమ్మెబాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన వాలంటీర్లను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో నిన్న (బుధవారం) సమ్మెకు దిగిన 18 మంది వాలంటీర్లలో ముగ్గురిని తప్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ అయ్యాయి. మరికొందరిని తప్పించడానికి అధికారుల అడుగులు వేస్తున్నారు. ఎవరు సమ్మె చేసినా ఊరుకోవద్ధని అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఆడియో మెసేజ్‌లో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరు పట్ల వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 28 , 2023 | 01:52 PM