ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను నమ్మవద్దు..

ABN, First Publish Date - 2023-08-10T16:46:16+05:30

తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ది వారాహియాత్ర కాదని.. మోదీ యాత్ర అని విమర్శించారు.

తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), జనసేన పార్టీ అధ్యక్షుడు (Janasena Chief) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ (Prajasanthi Party) వ్యవస్థాపకుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ది వారాహియాత్ర (Varahiyatra) కాదని.. మోదీ యాత్ర (Modi Yatra) అని విమర్శించారు. చిరంజీవి పైకి మంచివారిలా కనిపిస్తారని, లోపల మాత్రం కుతంత్రం, మోసమేనని విమర్శించారు. చిరంజీవి, పవన్‌లు జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) వైపు ఎర్రగా చూస్తున్నారని.. ప్రజారాజ్యంకు 18 శాతం ఓట్లు వస్తే.. జనసేనకు కేవలం 6 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా వారిపై పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana), ప్రొఫెసర్ నాగేశ్వర్ (Professor Nageshwar), జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana)లు యాంకర్లుగా మిగిలిపోవద్దని కేఏ పాల్ సూచించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సిగ్గు ఉంటే పార్టీలకు రాజీనామాలు చేసి దోచుకున్న డబ్బు తిరిగి ప్రజలకు ఇవ్వాలన్నారు. క్రైస్తవులు మణిపూర్‌ను, ముస్లీంలు హర్యానాలో పరిస్థితులను గమనించాలన్నారు. తన ఫోటో చూపించి ఎన్నికల్లో పోటీ చేయాలని.. అలా చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి రూ. 100 నుంచి వెయ్యి కోట్లు ఇస్తాని కేఏ పాల్ అన్నారు.

Updated Date - 2023-08-10T16:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising